Share News

When the stream floods, it spells terror. గెడ్డ పొంగితే గడగడే

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:20 AM

When the stream floods, it spells terror. తుఫాన్‌లు వచ్చినా, భారీవర్షాలు కురిసినా రేగిడి మండలంలోని నాలుగు గ్రామాలు వణికిపోతాయి. రెండు మూడురోజులు ఏకధాటిగా వర్షాలు కురిస్తే ఇక ఆ గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలోనే ఉంటాయి.

When the stream floods, it spells terror. గెడ్డ పొంగితే గడగడే
గెడ్డ పొంగితే రేగిడి గ్రామం ఇలా

గెడ్డ పొంగితే గడగడే

ఆకులోవగెడ్డకు వరద వస్తే నాలుగు గ్రామాలకు ముప్పు

నీటిలోనే రహదార్లు, ప్రభుత్వ కార్యాలయాలు

గెడ్డ ఆక్రమణలతోనే ఈ పరిస్థితి

పట్టించుకోని నేతలు, అధికారులు

తుఫాన్‌లు వచ్చినా, భారీవర్షాలు కురిసినా రేగిడి మండలంలోని నాలుగు గ్రామాలు వణికిపోతాయి. రెండు మూడురోజులు ఏకధాటిగా వర్షాలు కురిస్తే ఇక ఆ గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలోనే ఉంటాయి. ఒక గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వ్యవసాయ పొలాలు నీటిలో మునిగి ఉండాల్సిందే. ఏటా అకులోవగెడ్డ పొంగినప్పుడు ఉణుకూరు, అంబాడ వెంకటాపురం, రేగిడి, చెలికానవలస గ్రామస్థులు పడుతున్న అవస్థలివి. గెడ్డ ఆక్రమణలతో కుచించుకుపోయి గ్రామాలపై పడుతోంది. వారం కిందట భారీ వర్షాలకు ఆ గ్రామాల వారంతా నరకయాతన పడ్డారు. తుఫాన్‌ వార్త చెవిన పడితే వణికిపోతుంటారు.

రేగిడి, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి):

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు దరి ఆకులకట్ట అడవి నుంచి ఈగెడ్డ ప్రవహిస్తోంది. రేగిడి మండలంలోకి ఉణుకూరు వద్ద ప్రవేశించి అంబాడ, చెలిగానవలస-వెంకమ్మపేట మీదుగా రేగిడి వరకు దాదాపు 21 కిలోమీటర్లు ప్రయాణించి రేగిడిలోని సాయన్నగెడ్డలో కలుస్తుంది. ఈగెడ్డ వెడల్పు రికార్డుల ప్రకారం 30మీటర్లు వరకు ఉండాలి. ప్రస్తుతం చూస్తే ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. 15 నుంచి 10 మీటర్ల్లులోపే ఉంది. ఇరువైపులా ఆక్రమణలతో కుచించుకు పోయింది. ఆక్రమణదారుల తీరుతో వదరలొచ్చినప్పుడు వారే మొదటి బాధితులవుతు న్నారు. ఆపై గ్రామాల్లోకి నీరు చొరబడి బాధితులు పెరుగుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు ఆయా గ్రామాలు వణికిపోయాయి. గెడ్డ ఉగ్రరూపం దాల్చితే రేగిడి గ్రామం జలదిగ్బంధానికి గురవుతోంది. చెలికానవలస- వెంకమ్మపేట రోడ్డుపై నీరు అధికంగా ప్రవహించి రాకపోకలు స్తాంభించిపోతాయి. దీంతో ఒకటి రెండురోజులు రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతుంది. గత వారం ఇదే జరిగింది. రేగిడి గ్రామ వంతెనపై నీరు ప్రవహించి ప్రభుత్వ కార్యాలయాలలైన వెటర్నరీ అసుపత్రి, రేగిడి పీహెచ్‌సి, అంగన్వాడీ కేంద్రం రెండు మూడురోజలు నీటిలో ఉండి సెలువులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈగెడ్డ పొంగడంతో అంబాడ వెంకటాపుర, రేగిడి, చెలికానవలస పొలాలు వందలాది ఎకరాలు నీటిలో ఉండిపోయాయి. దీనివల్లే తుఫాన్‌లు రాకూడదు దేవుడా అని ఈ గ్రామాలవారు నిరంతరం దేవుణ్ని కోరుకుంటారు.

ఆక్రమణలతోనే ఈ పరిస్థితి

గెడ్డ ఆధారంగా ఒకప్పుడు రెండు పంటలు సాగుచేసిన రైతులు కాలక్రమంలో గెడ్డను ఆక్రమించేశారు. చివరికి వరదల రూపంలో వారికే ఎసరైంది. మరోవైపు ఈప్రాంతంలో చేపల చెరువులు పుట్టుకొచ్చాయి. వారు కూడా గెడ్డను ఆక్రమించుకొన్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు అధికారులకు అందాయి. కానీ నేతలు కాని, అధికారులు కాని పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈగెడ్డ ఆక్రమణలపై ఫిర్యాదులు, విచారణల వరకు వెళ్లి రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోయినట్లు సమాచారం. ఇప్పటికైనా కూటమి సర్కారు గెడ్డ అభివృద్ధికి నడుంబిగించాలని, ఆక్రమణలు గురించి ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:20 AM