Share News

‘నైరుతి’ వచ్చేసిన వేళ..

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:37 AM

నైరుతి పవనాలు ప్రవేశించడంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువజామున నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

‘నైరుతి’ వచ్చేసిన వేళ..
విజయనగరం పట్టణంలో కురుస్తున్న వర్షం

  • జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలు

  • నారు మడులు సిద్ధం చేసుకుంటున్న రైతులు

విజయనగరం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): నైరుతి పవనాలు ప్రవేశించడంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువజామున నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో జోరువాన కురిసింది. గాజులరేగ, పాత బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, తోటపాలెం, ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడ్డారు. అదేవిధంగా జిల్లాలో బొబ్బిలి, బాడంగి, బొండపల్లి, నెల్లిమర్ల, గంట్యాడ, గజపతినగరం, దత్తిరాజేరు, బొబ్బిలి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు, విద్యు త్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈ వారంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆనందంతో రైతులు ఖరీఫ్‌నకు సిద్ధ మవుతున్నారు. సేంద్రియ ఎరువుల కోసం పొలాల్లో చిరు ధాన్యాలు సాగుచేస్తున్నారు. వరిసాగు కోసం ముంద స్తుగా నారు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా శుక్రవారం కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

Updated Date - Jun 20 , 2026 | 12:37 AM