Share News

నిధులు మంజూరైనా ఏంలాభం?

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:06 AM

మండ లంలోని సిరిపురం పంచాయతీలో సుమారు రూ.36లక్షల విలువైన వివిధ అభివృద్ధి పను లు మంజూరయ్యాయి.

నిధులు మంజూరైనా ఏంలాభం?

  • పదేళ్లగా ఒక్క అభివృద్ధి పని కూడా చేయని వైనం

  • ఈనెలాఖరులోగా పనులు ప్రారంభించకపోతే నిధులు వెనక్కే..

  • ఇదీ సిరిపురం పంచాయతీ పరిస్థితి

గంట్యాడ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండ లంలోని సిరిపురం పంచాయతీలో సుమారు రూ.36లక్షల విలువైన వివిధ అభివృద్ధి పను లు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నెలాఖరులలోగా మంజూరైన పనులు మొద లుపెట్టకపోతే నిఽధులు వెనక్కి వెళ్లిపోనున్నా యి. గతంలో కూడా గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులకు రూ.70లక్షల విలువైన పనులు మంజూరయ్యాయి. అప్పట్లో కూడా పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయి. గ్రామంలో గత పదేళ్లగా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. దీనికి ప్రధానం గా గ్రామంలోని నాయకుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తోంది. గ్రామంలోని చాలా వీఽధుల్లో సీసీ రోడ్లు, కాలువలు లేకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం రూ.36లక్షలు విలువ గల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు మంజూరయ్యాయి. ఈ పనులు ఈనెలాఖరులోగా ప్రారంభించాలి. లేకపోతే మంజూరై నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంజూరైన పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎవరూ ముందుకు రాలేదు

ఇదే విషయం పంచాయతీరాజ్‌ జేఈ కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా.. మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని గ్రామానికి చెందిన ప్రధాన నాయకు లు తెలియజేశామని, ఇంకా ఎవరూ పనులు చేయడా నికి ముందుకు రాలేదని తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 12:06 AM