Share News

What's Really Going On? అసలేం జరుగుతోంది?

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:25 PM

What's Really Going On? కురుపాం గిరిజన సంక్షేమ గురుకులు బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైరల్‌ జ్వరాల నుంచి విద్యార్థినులు కోలుకుంటున్నారని సిబ్బంది చెబుతున్నా.. రోజుకు ముగ్గురు నుంచి ఐదుగురు బాలికలు కురుపాం సీహెచ్‌సీలో చేరుతున్నారు. పాఠశాలలో వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తున్నా.. ఈ పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

What's Really Going On? అసలేం జరుగుతోంది?
కురుపాం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

  • పాఠశాలలో చికిత్స అందిస్తున్నా..

  • వైరల్‌ జ్వరాలతో సీహెచ్‌సీలో చేరుతున్న బాలికలు

  • వారి ఆరోగ్యం విషయంలో గోప్యత పాటించడంపై విమర్శల వెల్లువ

పార్వతీపురం/కురుపాం, నవంబరు10(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకులు బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైరల్‌ జ్వరాల నుంచి విద్యార్థినులు కోలుకుంటున్నారని సిబ్బంది చెబుతున్నా.. రోజుకు ముగ్గురు నుంచి ఐదుగురు బాలికలు కురుపాం సీహెచ్‌సీలో చేరుతున్నారు. పాఠశాలలో వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తున్నా.. ఈ పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరోవైపు గురుకులంలోకి ఎవర్నీ అనుమతించడం లేదు. తల్లిదండ్రులను గేట్‌ వద్ద ఉంచి వారి పిల్లలతో మాట్లాడిస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా విద్యార్థినుల ఆరోగ్యం విషయంపై గోప్యత పాటిచండంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవంగా కురుపాం గురుకులంలో ఇటీవల కాలంలో 110 మంది విద్యార్థినులు జ్వరం, తలనొప్పి, వాంతులు, జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. 71 మందికి పైగా విద్యార్థినులు వైద్య సేవలు పొందగా.. కొంతమంది రికవరీ అయ్యారు. మరికొంతమంది బాలికలు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి పాఠశాలలోనే జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు బాలికలను కురుపాం ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. సోమవారం ముగ్గురు విద్యార్థినులను .. మంగళవారం సాయంత్రం ఐదుగురిని సీహెచ్‌సీలో చేర్పించారు. మొత్తంగా ఎనిమిది మంది చిక్సిత పొందుతున్నారు. వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న గురుకులం విద్యార్థినులు మెల్లక లావణ్య, రాయుల ప్రశాంతి, కొండగొర్రి ఝాన్సీ రాణి , వి.సోనియా, పి.సుస్మ హర్షశ్రీ, ఏనుగుల హరిక, ఊయక మాధురి, కోలక దివ్యకు చికిత్స అందిస్తున్నామని సీహెచ్‌సీ వైద్యుడు పృథ్వీ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:25 PM