What on Earth Happened? ఏమైందో ఏమో?
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:08 AM
What on Earth Happened? జియ్యమ్మవలస మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్వగ్రామంలో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరువుతున్నారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
బెంగళూరులో ఘటన
స్వగ్రామం కన్నపుదొరవలసలో విషాదం
జియ్యమ్మవలస, జనవరి26(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్వగ్రామంలో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరువుతున్నారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే.. కన్నపుదొరవలస గ్రామానికి చెందిన జాగాన కిరణ్‌కుమార్ (42) బెంగళూరు ఎయిర్‌పోర్టులో 2009 నుంచి సీఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బెంగళూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆదివారం సాయంత్రం రైలు పట్టాలపై బోర్లాపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన సోదరుడు గంగునాయుడు హుటాహుటిన బెంగళూరు వెళ్లారు. కాగా కిరణ్‌కుమార్ మృతిని తల్లిదండ్రులు గుంపస్వామి, విజయమ్మ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బిడ్డ జ్ఞాపకాలు తలుచుకుని భోరున విలపిస్తున్నారు. మృతదేహానికి బెంగళూరులోనే పోస్టుమార్టం నిర్వహించి కన్నపుదొరవలసకు పంపనున్నట్లు అధికారులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.