ఇదేం పద్ధతి సారూ!
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:36 PM
బాడంగి డిప్యూటీ ఎంపీడీవో దేవకుమార్ కార్యాలయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.
- ఆఫీసులో టేబుల్‌పై కాలు పెట్టి ఫోన్‌లో సంభాషణ
- బాడంగి డిప్యూటీ ఎంపీడీవో తీరుపై విమర్శలు
బాడంగి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): బాడంగి డిప్యూటీ ఎంపీడీవో దేవకుమార్ కార్యాలయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. వైస్ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకుడు పాలవలస గౌరి బుధవారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ డిప్యూటీ ఎంపీడీవో తన సీటులో కూర్చొని, ఎదురుగా ఉన్న టేబుల్‌పై కాలు మీద కాలు వేసుకుని సెల్‌ఫోన్‌లో మాట్లాడడం కనిపించింది. వెంటనే ఆయన ఈ విషయం ఎంపీడీవోతోపాటు తోటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ విషయమై తాను కలెక్టర్, సీఈవోతోపాటు అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తానని వైస్ ఎంపీపీ తెలిపారు.
అలా కూర్చోవడం తప్పే: ఎంపీడీవో శ్రీలత
‘డిప్యూటీ ఎంపీడీవో దేవకుమార్ అలా కూర్చోవడం తప్పే. ప్రభుత్వ కార్యాలయంలో పద్ధతిగా ఉండాలి. సొంత ఇంటి మాదిరిగా వ్యవహరిస్తేమంటే కుదరదు. కార్యాలయానికి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. భవిష్యత్తులో కార్యాలయ సిబ్బంది ఇలా వ్యవహరించకుండా చూసుకుంటాం’ అని ఎంపీడీవో శ్రీలత వివరణ ఇచ్చారు.