Share News

What is our situation? మా పరిస్థితి ఏంటి?

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:01 AM

What is our situation? గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన కిలపర్తి నాయుడుబాబు, దుర్గ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారు గంట్యాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. నాయుడుబాబు దివ్యాంగుడు కాగా తన బావ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆయన పేరు వీరి ఇంటికి మ్యాపింగ్‌ అయిపోయింది. దీంతో పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించలేదు. తన బావ పేరును హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో తీయడానికి ప్రభుత్వం ఆప్షన్‌ ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇదే కారణంతో తల్లికి వందనం అందలేదు. ఇప్పటికీ అదే సమస్య. దీనిపై నాయుడుబాబు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో విన్నవించాడు.

What is our situation? మా పరిస్థితి ఏంటి?
పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు విన్నవిస్తున్న అర్జీదారులు

మా పరిస్థితి ఏంటి?

ప్రశ్నిస్తున్న తల్లికి వందనం పథకం అర్హులు

చాలా మందికి దక్కని సాయం

పీజీఆర్‌ఎస్‌లో 105 వినతులు

రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలంటున్న జిల్లా అధికారులు

ప్రభుత్వ స్పందన కోసం అర్హుల నిరీక్షణ

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి)

గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన కిలపర్తి నాయుడుబాబు, దుర్గ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారు గంట్యాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. నాయుడుబాబు దివ్యాంగుడు కాగా తన బావ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆయన పేరు వీరి ఇంటికి మ్యాపింగ్‌ అయిపోయింది. దీంతో పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించలేదు. తన బావ పేరును హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో తీయడానికి ప్రభుత్వం ఆప్షన్‌ ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇదే కారణంతో తల్లికి వందనం అందలేదు. ఇప్పటికీ అదే సమస్య. దీనిపై నాయుడుబాబు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో విన్నవించాడు.

పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం గ్రామానికి చెందిన పి.అప్పలనాయుడు ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు. వీరు కూడా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అప్పలనాయుడు గతంలో ఆదాయపన్ను చెల్లించారు. ఇప్పుడు తక్కువ జీతం కావడంతో చెల్లించడం లేదు. కానీ ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు కారణం చూపుతూ గత ఏడాది, ఇప్పుడు కూడా ఆయన పిల్లలకు తల్లివందనం పథకం అందలేదు.ఆదాయం పన్ను చెల్లించడం లేదని ఆన్‌లైన్‌లో గ్రీవెన్స్‌ అప్రూవల్‌ అయినా పథకం దక్కలేదు. దీనిపై ఆయన పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకున్నారు.

డెంకాడ మండలం గుణుపూరు గ్రామానికి చెందిన వానపల్లి నర్సింగరావు, మణి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వానపల్లి జ్ఞానదీప్‌ రెండో తరగతి చదువుతున్నాడు. జాన్ఞదీప్‌కు గత ఏడాది జమ్మునారాయణఫురం ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీటు వచ్చింది. కాని తల్లిదండ్రులు చేర్పించలేదు. ఇదే కారణంతో గత ఏడాది తల్లికి వందనం నిధులు విడుదల కాలేదు. అప్పట్లో పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తడంతో మరోసారి మొరపెట్టుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా చాలా మంది తల్లులకు తల్లికి వందనం పథకం పొందే అర్హత ఉన్నా? వివిధ కారణాల వల్ల దూరమయ్యారు. వాటిని నివృత్తి చేయాలని, తమకు లబ్ధి చేకూర్చాలని కోరుతూ వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉంది. స్పందించకపోవడంతో గత ఏడాది అందుకోలేని వారు ఈ ఏడాది కూడా పథకానికి దూరమయ్యారు. తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం గతనెల 23న విడుదల చేసింది. జిల్లాలో 1,54,612 మంది తల్లులకు దాదాపు రూ.200 కోట్లు మంజూరు చేసింది. అయితే జిల్లాలో ఇంకా చాలా మందికి అర్హత ఉన్నా వివిధ కారణాల వల్ల దూరమయ్యారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో తప్పుగా నమోదు కావడంతో కొందరికి పథకం అందలేదు. ఆదాయ పన్ను చెల్లించనట్లు అధికారులు ధ్రువీకరించినా రాష్ట్ర స్థాయిలో ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ కాలేదు. అలాగే ఆర్‌టిఐ ద్వారా కార్పొరేట్‌ పాఠశాలలో సీటు పొంది వివిధ కారణాల వల్ల ఆ స్కూల్‌లో చేరకపోయినా తల్లికివందనం సాయం దక్కని వారు చాలా మంది ఉన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో 105 మంది తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నా మంజూరు కాలేదంటూ అధికారులకు విన్నవించుకున్నారు. గతంలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ చేసిన సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును అనుసంధానం చేశారు. మ్యాపింగ్‌ను సవరించడానికి రాష్ట్ర స్థాయిలో అవకాశం లేక చాలా మంది పథకాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారం జిల్లా అధికారుల చేతిలో లేదు. ఇదే విషయాన్ని వారు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పథకానికి అర్హత ఉన్నా అందకపోవడంతో ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:01 AM