Share News

What is happening in the Revenue Department? ‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:03 AM

What is happening in the Revenue Department? రెవెన్యూ విభాగంలో మండల స్థాయిలో కీలక పోస్టుగా ఉండే తహసీల్దార్‌ బాధ్యతలను ఆర్‌ఎస్‌డీటీలకు అప్పగించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో కొందరిని తహసీల్దార్‌గా నియమించి అంతలోనే ఇతర మండలాల్లో డిప్యుటేషన్‌ వేయడం.. ఇంకొందరికి అర్హత ఉన్నా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

What is happening in the Revenue Department? ‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?

‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?

- రెండు మండలాల్లో ఆర్‌ఎస్‌డీటీలకు తహసీల్దార్‌ బాధ్యతలు

- చాలా చోట్ల డిప్యుటేషన్లపైనే తహసీల్దార్లు, డీటీలు

- రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉద్యోగుల మార్పులు

రెవెన్యూ విభాగంలో మండల స్థాయిలో కీలక పోస్టుగా ఉండే తహసీల్దార్‌ బాధ్యతలను ఆర్‌ఎస్‌డీటీలకు అప్పగించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో కొందరిని తహసీల్దార్‌గా నియమించి అంతలోనే ఇతర మండలాల్లో డిప్యుటేషన్‌ వేయడం.. ఇంకొందరికి అర్హత ఉన్నా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి):

వంగర, రేగిడి మండలాలకు రెగ్యులర్‌ తహసీల్దార్లు లేక అక్కడ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి వంగర తహసీల్దార్‌గా శివనాగజ్యోతిని నియమించినప్పటికీ ఆమెను తిరిగి వెంటనే చీపురుపల్లి ఆర్‌డీవో కార్యాలయం ఏవోగా డిప్యుటేషన్‌ వేశారు. దీంతో అక్కడ సీఎస్‌డీటీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే గత నెలలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఆయన సరిగా స్పందించలేదని భావించి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సస్పెండ్‌ చేశారు. దీంతో అక్కడ తహసీల్దార్‌ బాధ్యతలను రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ (ఆర్‌ఎస్‌డీటీ) శ్రీనివాసరావుకు అప్పగించారు. రేగిడి తహసీల్దార్‌గా పనిచేసిన కృష్ణలత రిలీవ్‌ కావడంతో అక్కడ కూడా ఆర్‌ఎస్‌డీటీ ఈశ్వరరావుకు తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

- జూన్‌ 24న డిప్యూటీ తహసీల్దార్‌ నుంచి తహసీల్దార్‌గా పదోన్నతిపై విశాఖపట్నం వెళ్లిన స్వర్ణబాయికి గంట్యాడ తహసీల్దార్‌గా పోస్టింగ్‌ చూపిస్తూ ఉత్వర్తులు ఇచ్చారు కాని ఆమెను కలెక్టరేట్‌లోనే ఉంచి చీపురుపల్లిలో పనిచేస్తున్న సూర్యకాంతంను గంట్యాడ తహసీల్దార్‌గా డిప్యూటేషన్‌పై నియమించారు.

- కొద్దినెలల కిందట తహసీల్దార్‌ నుంచి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చిన పద్మావతి ప్రమోషన్‌ తీసుకోలేదు. ఇప్పుడు ఆమెకు ఏ పోస్టు కూడా ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు.

- పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో పరిపాలన అఽధికారిగా పనిచేసిన పి.రమేష్‌ను నాలుగు రోజులు క్రితం భోగాపురం తహసీల్దార్‌గా నియమించారు. అక్కడ డిప్యూటేషన్‌ఫై పని చేస్తున్న హేమంత్‌కుమార్‌ను తీసుకువచ్చి విజయనగరం రూరల్‌ తహసీల్దార్‌ కూర్మనాఽథ్‌(సెలవులో ఉన్నారు) స్థానంలో నియమించారు. వచ్చే నెల 4న తిరిగి విధుల్లోకి రానున్న కూర్మనాథ్‌కు ఎక్కడ పోస్టింగ్‌ చూపిస్తారో అధికారులకే తెలియాలి.

పరిపాలన కేంద్రమైన రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టుల్లో మార్పులపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పోస్టింగ్‌ ఒక చోట చూపించడం మరోచోట బాధ్యతలు అప్పగించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాన మైన పోస్టుల్లో నియమించి మళ్లీ డిప్యూటేషన్‌ వేయడం సరికాదంటున్నారు. కొన్నినెలల నుంచి రెవెన్యూ శాఖలో కొంతమంది తహసీల్దార్లు, మరికొంతమంది డిప్యూటీ తహసీల్లార్లు డిప్యూటేషన్‌లపై విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వేలో భాగంగా భూసరిహద్దుల గుర్తింపులో లోపాలు తలెత్తడంతో పాటు ఇంకా ఏవైనా సమస్యలుంటే వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ (ఆర్‌ఎస్‌డీటీ) పోస్టులను సృష్టించారు.

సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐలకు పద్నోనతి కల్పించి మండలానికి ఒక ఆర్‌ఎస్‌డీటీని నియమించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆర్‌ఎస్‌డీటీ పోస్టులను కొనసాగించారు. సాధారణంగా ప్రతి మండలానికీ ఒక తహసీల్దార్‌, హెచ్‌డీటీ, సీఎస్‌డీటీ, ఆర్‌ఎస్‌డీటీలు ఉంటారు. ఆర్‌ఎస్‌డీటీలు మినహా మిగిలిన వారంతా సీనియర్లే. అయితే వంగర, రేగిడిలో ఆర్‌ఎస్‌డీటీలకు తహసీల్దార్‌ బాధ్యతలు అప్పగించడంపై అనేక విమర్శలు వినిస్తున్నాయి. వాస్తవానికి వీరికి అనుభవం తక్కువ. స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌డీటీలతోనే అన్ని కార్యకలాపాలు నిర్వహించడం వల్ల లోపాలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు వద్ద ప్రస్తావించగా తహసీల్దార్‌ స్వర్ణబాయికి డిప్యూటీ కలెక్టర్‌ వద్ద పోస్టింగ్‌ చూపించామని, పద్మావతికి కూడా తగిన బాధ్యతలు అప్పగిస్తామన్నారు. తప్పని పరిస్థితిలో ఆర్‌ఎస్‌డీటీకి తహసీల్దారు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని వెల్లడించారు.

Updated Date - Oct 14 , 2026 | 12:03 AM