What Happened That Day.. ఆ రోజు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:05 AM
What Happened That Day.. ఈ ఫొటో చూశారా.. సాలూరులో క్విట్ ఇండియా ఉద్యమానికి సజీవ సాక్ష్యం ఈ చిత్రం. నాడు పట్టణ మెయిన్‌రోడ్డులో భారీ నిరసన ప్రదర్శనకు బ్రిటిష్ పోలీసులే బందోబస్తు నిర్వహించారు.
నాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నినదించిన ప్రజలు
సాలూరు, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): ఈ ఫొటో చూశారా.. సాలూరులో క్విట్ ఇండియా ఉద్యమానికి సజీవ సాక్ష్యం ఈ చిత్రం. నాడు పట్టణ మెయిన్‌రోడ్డులో భారీ నిరసన ప్రదర్శనకు బ్రిటిష్ పోలీసులే బందోబస్తు నిర్వహించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహోన్నత ఘట్టంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చెబుతారు. 1942లో మహాత్మా గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు నాడు ప్రజలంతా ఉత్తేజులై.. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే సాలూరు పట్టణంలోనూ ఆనాడు సర్దార్ కూనిశెట్టి వెంకటనారాయణ దొర ఆధ్వర్యంలో ప్రజలు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములైనట్లు పలువురు వృద్ధులు చెబుతున్నారు. కాగా నాడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సర్దార్ కూనిశెట్టి వెంకట నారాయణదొరే సాలూరుకు మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.