What grade should be achieved in each branch? ప్రతి శాఖ ఏ గ్రేడ్ సాధించాల్సిందే
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:42 PM
What grade should be achieved in each branch? జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలూ పనితీరును మెరుగుపరుచుకుని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకుని, ఏ గ్రేడ్ సాధించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ప్రతి శాఖ ఏ గ్రేడ్ సాధించాల్సిందే
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జనవరి 13(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలూ పనితీరును మెరుగుపరుచుకుని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకుని, ఏ గ్రేడ్ సాధించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డిసెంబరు 2025కు సంబంధించి ప్రగతిపై శాఖల వారీగా సమీక్షించారు. పనితీరులో వెనకబడిన శాఖలపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 31 శాఖలు సి గ్రేడ్‌లో ఉండటంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కేవలం 27 శాఖలు మాత్రమే ఏ గ్రేడ్ సాధించాయని, మిగిలిన 20 శాఖలు బి గ్రేడ్‌లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పోలీసు, హౌసింగ్, ఉద్యాన శాఖలు తమ గ్రేడింగ్‌ను మెరుగుపరుచు కోవాలని ఆదేశించారు. జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో 70 శాతం వాటా కలిగిన 53 కీలక ఆర్థిక సూచీలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలని, వీటి ఆధారంగానే జిల్లా అభివృద్ధిని అంచనా వేస్తారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) అమలుపై స్పందిస్తూ పీఎంపోషణ్, ఉపాధి హామీ పథకాల్లో సాధించిన ప్రగతిని కొనసాగించాలని, తక్కువ శాతం నమోదైన స్వచ్ఛ భారత్‌మిషన్, ఐసీడీఎస్ వంటి విభాగాల్లో లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. డేటా ఎంట్రీ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి నెలా 5వ తేదీలోగా హెచ్‌వోడీలు స్వయంగా డేటాను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో బాలాజీ తదితరులు ఉన్నారు.