కట్టెలతో వంట చేయడమేంటి?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:22 AM
ప్రభుత్వం వంటకు అవసరమైన గ్యాస్ సరఫరా చేస్తుండగా కట్టెలతో చేయడమేంటని వంట నిర్వాహకులపై ఆర్డీవో మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మక్కువ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
మక్కువ. జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వంటకు అవసరమైన గ్యాస్ సరఫరా చేస్తుండగా కట్టెలతో చేయడమేంటని వంట నిర్వాహకులపై ఆర్డీవో మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగది పరిసరాలు, స్టాక్ రూమ్ వద్ద చెత్త నిల్వ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచడం బాద్యతగా తీసుకోవాలని హెచ్‌ఎం రోజారాణిని ఆదేశించారు. గురువారం మక్కువ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం పాఠశాలలో మెగా పీటీఎం 4.0 నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆమె పాఠశాలను సందర్శించారు. ముందుగా పదో తరగతి విద్యార్థుల గదికి వెళ్లి ముస్తాబు, విద్యా ప్రమాణాల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం వంటల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. వంటలను ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు.