Share News

What about the lease arrears? లీజు బకాయి సంగతేంటో?

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:31 AM

What about the lease arrears? మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట లీజు కేటాయింపులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వసూళ్ల వ్యవహారం నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఫసలీలకు(వేట లీజు బకాయి) సంబంధించిన లక్షలాది రూపాయలు పెండింగ్‌ ఉండగానే కొత్త ఫసలీ కోసం అధికారులు నోటీసు ఇవ్వడం.. వాటిని మాత్రమే వసూలు చేసి అనుమతులు మంజూరు చేయటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసున్నారు.

What about the lease arrears? లీజు బకాయి సంగతేంటో?
మడ్డువలస జలాశయం

లీజు బకాయి సంగతేంటో?

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేటకు అనుమతులపై అనుమానాలు

బకాయిలు వదిలి కొత్తలీజు వసూలు

నిబంధనలకు పాతర

వంగర, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట లీజు కేటాయింపులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వసూళ్ల వ్యవహారం నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఫసలీలకు(వేట లీజు బకాయి) సంబంధించిన లక్షలాది రూపాయలు పెండింగ్‌ ఉండగానే కొత్త ఫసలీ కోసం అధికారులు నోటీసు ఇవ్వడం.. వాటిని మాత్రమే వసూలు చేసి అనుమతులు మంజూరు చేయటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసున్నారు.

మడ్డువలస రిజర్వాయర్‌ పరిధిలో గత ఫసలీలు 1431, 1432, 1433, 1434కు సంబంధించి ఓ మత్య్సకార సొసైటీ సభ్యులు రూ.57,74,915 లక్షలు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి వారికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. వెంటనే లీజు బకాయిలు కట్టాలని, లేదంటే రిజర్వాయర్‌లో చేపటవేట చేపట్టవద్దని హెచ్చరించారు. అలాగే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయినా లీజు కట్టకపోవడంతో చేపల వేట కోసం ఆక్షన్‌ వేయటానికి సిద్ధమయ్యారు. దీనిపై స్పష్టత రాకమునుపే తాజాగా కొత్త ఫసలీ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత నాలుగుతో పాటు 1435 ఫసలీ లీజు కట్టాలని మత్య్సకార సంఘం సభ్యులకు అధికారులు డిమాండ్‌ నోటీస్‌ అందజేశారు. కానీ ఆ సొసైటీ 1435 ఫసలీకి చెందిన రూ18,21,817 లక్షలు మాత్రమే చెల్లించి వేట అనుమతులు పొందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాత బకాయిలను పూర్తిగా చెల్లించని పక్షంలో వేట అనుమతులు నిలిపేయడం లేదా లీజు రద్దుచేయడం తదితర చర్యలు చేపడ్తారని, ఈ నిబంధనలను పక్కనబెట్టి ఆధికారులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిల వసూలుపై అధికారులు ఎందుకు దృష్టి సారించలేదు. రూ.57,74,915 లక్షలు బకాయిలను రికవరీ చేయకుండా కొత్త అనుమతులు మంజూరు వెనుక ఏం జరిగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఒకరు సస్పెండ్‌

గతంలో ఇదే వివాదంలో మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండయ్యారు. 1428 ఫసలీ లీజు బకాయిలు ఉండగా 1429, 1430 కోసం నోటీసులు ఇచ్చి కట్టించుకుని 1428 బకాయిలు వదిలేశారు. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి విచారించారు. లోపాలు జరిగినట్లు నిర్ధారించుకుని ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.

బకాయిలు చెల్లించాలి

ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌, మత్స్యశాఖ, మడ్డువలస

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలవేటకు లీజు బకాయిలు (నాలుగు ఫసలీలకు చెందిన)రూ.57 లక్షలకు పైబడి చెల్లించాలి. దీనిపై అవసరమైతే పోలీసులకు సమాచారం ఇస్తాను.

Updated Date - Aug 10 , 2026 | 12:31 AM