Share News

పెళ్లికి వెళ్లి.. విగతజీవిగా మారి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:25 AM

పెళ్లికి వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. ఆయన చెరువులో శవమై తేలడం మిస్ట రీగా మారింది.

పెళ్లికి వెళ్లి.. విగతజీవిగా మారి
కిషోర్‌(ఫైల్‌)

- చెరువులో శవమై తేలిన వ్యక్తి

- 12 రోజుల తరువాత గుర్తింపు

- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కొత్తవలస, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. ఆయన చెరువులో శవమై తేలడం మిస్ట రీగా మారింది. 12రోజుల తరువా త ఈ విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచా రణ చేపడుతున్నారు. కొత్తవలస సీఐ షణ్ముఖరావు చెప్పిన వివరా ల మేరకు.. శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి అల్లు కిషోర్‌(39) అనే వ్యక్తి ఈ నెల 8న కొత్తవ లస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ ఒడ్డుపేట గ్రామంలో జరిగిన పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరిగి ఇంటికి చేరకపోవ డంతో తండ్రి సత్యారావు పలుమార్లు ఫోన్‌ చేశాడు. ఫోన్‌రింగ్‌ అవుతున్నా ఎత్తడం లేదు. ఆ తరువాత ఫోన్‌ మోగడం ఆగిపోయింది. నాలుగు రోజుల పాటు ఎదురుచూసిన తండ్రి చివరకు ఈ నెల 12న కొత్తవలస పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిసింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కొత్తవలస పాత గ్రామానికి చెందిన శ్మశ్మానవాటిక వద్దనున్న బందలోని తుప్పల్లో పూర్తిగా కుళ్లిపోయిన శవం ఉన్నట్టు పశువుల కాపర్లు గుర్తించి స్థానిక వీఆర్వో రాధాకృష్ణకు సమాచారం అందించారు. ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూశారు. మృతదేహం పూర్తిగా పాడై గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో సత్యారావును రప్పించి మృతదేహాన్ని చూపించారు. అది తన కుమారుడేనని గుర్తించాడు. ఈ మేరకు సత్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. కిషోర్‌... పెళ్లికి వెళ్లిన గ్రామానికి, మృతదేహం దొరికిన ప్రాంతానికి సుమారు ఆరు కిలో మీటర్ల దూరం ఉంటుంది. అయితే, ఇక్కడకు ఎందుకు వచ్చాడు.. బందలో ఎలా శవమయ్యాడు అనేది మిస్టరీగా ఉంది. కిశోర్‌ జేబులో డబ్బులతో కూడిన పర్సు, సెల్‌ఫోన్‌ కూడా అలాగే ఉన్నాయి. శుక్రవారం శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శృంగవరపుకోట ఆస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని అన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:25 AM