Share News

ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి!

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:20 AM

ఉపాధి కోసం వెళ్లి...చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి!
వేపాడ: ముత్యాలరావు మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

వేపాడ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం వెళ్లి...చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బానాది గ్రామానికి చెందిన గీత కార్మికుడు కుప్ప ముత్యాలరావు (42) అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామానికి వెళ్లి..కల్లు గీస్తూ ఉంటాడు. బుధవారం కూడా అక్కడ కల్లు గీత కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడు. అతనికి భార్య సావిత్రి, కార్తీకస్వర్ణ, హర్షవర్ధన్‌ అనే పిల్లలు, తల్లి బుచ్చమ్మ,తండ్రి రాములు ఉన్నారు. పెద్ద దిక్కుగా ఉంటున్న ముత్యాలరావు మృతి చెందడంతోకుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కొత్తవలస, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస-శృంగవరపుకోట రహదారిలో ఈవీ షోరూం సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. రెండు మూడురోజుల కిందటే రైలులో నుంచి జారి పడి మృతి చెంది ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతం వైపు సాధారణంగా ఎవరూ వెళ్లరు. రైలు పట్టాల ఆవల ఉన్న చెరువులోకి బుధవారం మధ్యాహ్నం కొంతమంది చేపల పట్టడానికి వెళ్లారు. తుప్పల వద్ద నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూశారు. కుళ్లిన స్థితిలో మృతదేహం ఉంది. మృతుడికి సుమారు 45 ఏళ్ల వయస్సు ఉంటుంది. జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్టు వెసుకున్నట్టు తెలిపారు. స్థానిక పోలీసులకు, రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:20 AM