Share News

సర్టిఫికెట్‌ కోసం వెళ్లి..

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:14 AM

పదో తరగతి సర్టిఫి కెట్‌ కోసం స్కూల్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

 సర్టిఫికెట్‌ కోసం వెళ్లి..

డెంకాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పదో తరగతి సర్టిఫి కెట్‌ కోసం స్కూల్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డెంకాడ మండలం బెల్లాం గ్రామానికి చెందిన మల్లపురెడ్డి జగన్‌(16) గత సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణు డయ్యాడు. పైచదువులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఒక బేకరీ షాపులో పనిచేస్తున్నాడు. పదో తరగతి సర్టిఫికెట్‌ను తీసుకునేందుకు శుక్రవారం తన స్వగ్రామం బెల్లాం నుంచి మండలంలోని జొన్నా డ జడ్పీ హైస్కూల్‌కు వెళ్లాడు. అయితే స్కూల్‌ యాజమాన్యం సర్టిఫికెట్‌ ఇంకో రోజు ఇస్తామని చెప్పారు. అనంతరం జగన్‌ అక్కడ నుంచి వేరే పనిమీద సమీ పంలో గల మోదవలస వెళ్లి.. రోడ్డు దాటుతున్న సమయంలో విశాఖ నుంచి విజయనగరం వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో జగన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:14 AM