Eligible Beneficiaries అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:52 PM
Welfare Schemes for All Eligible Beneficiaries అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు పట్టణంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా శ్యామలాంబ ఆలయాన్ని సందర్శించారు.
సాలూరు, జూలై1(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు పట్టణంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా శ్యామలాంబ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం 16వ వార్డులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందించారు. కొత్తగా పింఛన్లు మంజూరైన తొమ్మిది మంది లబ్ధిదారులకు పత్రాలను అందించి.. నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
91 శాతం పంపిణీ
గరుగుబిల్లి: జిల్లాలో తొలిరోజు 91 శాతం మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. మొత్తంగా 1,24,789 మంది లబ్ధిదారులకు రూ.53.24 కోట్లు అందించారు.