Welfare Schemes అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - May 15 , 2026 | 11:42 PM
Welfare Schemes for All Eligible Beneficiaries ఐటీడీఏ పరిధిలో అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని పీవో ఆర్.వైశాలి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు, పథకాలు అమలులో పురోగతి తదితర అంశాలపై చర్చించారు.
పార్వతీపురం, మే 15(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని పీవో ఆర్.వైశాలి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు, పథకాలు అమలులో పురోగతి తదితర అంశాలపై చర్చించారు. పాడి ఆవుల పంపిణీకి సంబంధించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. పశు గ్రాసం కోతకు ఉపయోగపడే చాఫ్ కట్టర్లు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మత్స్యకారుల జీవనోపాధిన మెరుగుపరచాలని, వారికి అవసరమైన డ్రాగ్ నెట్ల పంపిణీకి తగిన ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరారు. చేపల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా పోర్టబుల్ హేచరీల ఏర్పాటుకు అనువైన స్థలాలు, ఆసక్తి ఉన్న లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు ఎస్.మన్మఽథరావు, టి.సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.