Share News

Welfare of Weavers నేతన్నల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:41 PM

Welfare of Weavers Is the Goal నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకైతే 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నెలిపర్తి గ్రామంలో నేతన్నల ఇళ్లకు వెళ్లి మగ్గం నేశారు.

Welfare of Weavers  నేతన్నల సంక్షేమమే ధ్యేయం
నెలిపర్తిలో మగ్గం నేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకైతే 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నెలిపర్తి గ్రామంలో నేతన్నల ఇళ్లకు వెళ్లి మగ్గం నేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా ఇంటి దగ్గర మగ్గం నేసేవారికి ఏడాదికి రూ.8,640, వర్క్‌షాపు మగ్గాల వారికి రూ.21,600 ఆదా అవుతుంది. చేనేత రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. చేనేత పరిశ్రమను బలోపేతం చేసి నేతన్నలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. భరోసా పథకం కింద చేనేత కార్మికులకు రూ.25వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రూ.10.44 కోట్లతో పలు క్లస్టర్లు మంజూరు చేశాం. ఉత్పత్తి విభాగంలో రూ.12 కోట్లు, మార్కెటింగ్‌ విభాగంలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం. సహకార సంఘాలకు త్రిఫ్ట్‌ ఫండ్‌ కేటాయింపు, ఆధునిక నేత యంత్రాల కొనుగోలుకు 90 శాతం సబ్సిడీ, ముడి సరుకుపై రాయితీ వంటివి అమలు చేస్తున్నాం. ఆధునిక డిజైన్‌ శిక్షణ అంది స్తున్నాం. చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం. ఆర్డర్‌ పొందిన ప్రతి మీటరు వస్త్రానికి రూ.120 ప్రోత్సాహం అందిస్తున్నాం. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. 40 నగరాలు, 50 కేంద్రాల్లో చేనేత వస్త్రాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం.’ అని తెలి పారు. అనంతరం అదే గ్రామంలో ఉపాఽధిహామీ పథకం పనులు ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు పరమేష్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:41 PM