Anganwadi Workers అంగన్‌వాడీల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:33 AM
Welfare of Anganwadi Workers Is the Goal అంగన్‌వాడీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోషణ అభియాన్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 75 గ్రామాలు ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
సాలూరు, మార్చి1(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోషణ అభియాన్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 75 గ్రామాలు ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు. ఆదివారం సాలూరులోని తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘ సమస్యల పరిష్కారంపై గతంలో అంగన్‌వాడీలు సమ్మె చేసినా వైసీపీ సర్కారు పట్టించుకోలేదు.. 15 యాప్‌ల వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబితే.. కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడి ఒక యాప్ వచ్చే విధంగా కృషి చేశారు. అంగన్‌వాడీలకు పనిభారం తగ్గించారు. 5జీ మొబైళ్లు ఇచ్చి.. జీతాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదే. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేశాం. అంగన్ వాడీలకు మెరుగైన జీవన విధానాన్ని రూపొందించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ధర్నాలతో ఎటువంటి ఫలితం ఉండదు. రూ.11,500 ఉన్న వేతనాన్ని ఒక్కసారిగా రూ.26వేలు పెంచమ నడం ఎంతవరకు సమంజసం. అయినప్పటికీ ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉంది. గతంలో జగన్ కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచారు. గతంలో ఎన్నడూలేని విధంగా అంగన్‌వాడీలకు భవనాలు, ఆట వస్తువులు, కూరగాయల పెంపకానికి మొక్కలు అందిస్తున్నాం. అంగన్‌వాడీలు ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దు.’ అని కోరారు.