సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:02 AM
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు తెలిపారు.
మెరకముడిదాం, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు తెలిపారు. గురు వారం గర్భాం సచివా లయం ఆవరణలో టీడీపీ మండలాధ్యక్షుడు తాడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన వికసిత్ భారత్ జీ రామ్‌జీ పథకం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి లైవ్ టెలీకాస్ట్ ద్వారా వచ్చే ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి రాజధాని నిర్మాణానికి అడ్డు తగిలి అభివృద్ధి నిరోధక శక్తిగా మారాడని విమర్శించారు. వైసీపీ హయాంలో అన్ని హత్యలే జరిగాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.సులోచన రాణి, ఇన్‌చార్జి ఎంపీడీవో సుధాకర్ పట్నాయక్, ఏపీడీ చంద్రకుమారి, ఏపీవో ఎస్.పెదప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు మోతీలాల్ నాయుడు, ధనుంజయ పాల్గొన్నారు.