Share News

సంక్షేమం.. అభివృద్ధి

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:28 AM

తల్లిదం డ్రులు, విద్యార్ధులు, లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని కొనియాడారు.

సంక్షేమం.. అభివృద్ధి

  • ‘తల్లికి వందనం’తో చదువుకు తప్పిన టెన్షన్‌

  • పింఛన్‌తో కుటుంబాలకు భరోసా

  • సాగు సాయంతో రైతుకు తప్పిన అప్పులబాధ

  • కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రసంశలు

  • ఎస్‌.కోటలో విజయవంతమైన ‘రెండేళ్ల నమ్మకం’

శృంగవరపుకోట, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): తల్లిదం డ్రులు, విద్యార్ధులు, లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని కొనియాడారు. అధి కారులు, ప్రజాప్రతి నిధులు అభివృద్ధి పనులను లెక్క లతో వివరించారు. శుక్ర వారం శృంగవరపుకోట పట్టణంలోని సిరికి పంక్షన్‌ హాల్‌లో కూటమి ప్రభు త్వం రెండేళ్ల పాలనపై నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు చేప్పేందుకు కార్యక్రమం నిర్వహిం చారు. సంక్షేమం, అభివృద్ధి స్టాల్స్‌ను శాఖలవారీగా ప్రదర్శించారు. అన్నదాత, సుఖీభవ పథకం ద్వారా సాయంతో సాగులో లాభం పొందుతున్నానని శృంగ వరపుకోట పట్టణానికి చెందిన రైతు గణేష్‌ తెలిపారు. వడ్డీకి అప్పులు తెచ్చుకునే పరిస్థితి తప్పిందని అనందం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాగా పని చేయడంతో నియోజ కవర్గం మెరుగైన స్థానంలో ఉందని శాసనసభ్యురా లు కోళ్ల లలిత కుమారి అ న్నారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుతో రైతులు భయపడ్డారని, చంద్రబాబు నా యుడు ఇచ్చిన హమీ మేరకు అధికా రంలోకి వచ్చిన వెంటనే దీని రద్దు కు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూ టమి అభ్యర్థులు ప్రజా ప్రతినిధు లుగా ఎన్నికైతేనే మరింత అభివృద్ధి చేసేందుకు వీలువుతుందన్నారు. కొత్తవలసలో ఎంఎస్‌ఎఈ పార్కు వస్తుందని, జిందాల్‌ భూముల్లో పరిశ్రమలు వస్తుండడంతో ఎస్‌.కోట ముఖచిత్రం మారుతుందని అన్నారు. ముఖ్య మంత్రి సహయ నిధి ద్వారా 450 కుటుంబాలకు రూ.4కోట్లు అందించామన్నారు. నియోజకవర్గ అభి వృద్ధికి రూ.3వేల కోట్లు రాబట్టి నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌.కోట నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఇ.మురళి (డిప్యూటీ కలెక్టర్‌), ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు శ్రీని వాసరావు, టీడీపీ నియోజ కవర్గ పరిశీలకుడు చౌదరి బాబ్జి, దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పొట్నూరు వెంకట రత్నాజీ, కూటమి నాయకులు కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్‌, కరెండ్ల ఈశ్వర రావు, జీఎస్‌నాయుడు, చొక్కాకుల మల్లునాయుడు, రెడ్డి వెంకన్న, పార్టీ నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా పనితీరు తెలుసుకుంటున్నారు. పరీ క్షల్లో మార్కులు వేస్తున్నట్లు మాకు ఇస్తున్నారు. జిల్లాలో నా పనితీరును లెక్కించి రెండో ర్యాంకు ఇచ్చారు. మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటు న్నారా? అన్న ప్రశ్నకు వందకు నూటపది మార్కులు పడ్డాయి. ఎవరికి ఏ అవసరం వచ్చిన నా దగ్గరకు నేరుగా రావచ్చు. వచ్చే ఏడాది జిల్లాలో మెదటి ర్యాంకు సాధించేలా పని చేస్తాను.

- కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్యే, ఎస్‌.కోట

Updated Date - Jun 20 , 2026 | 12:28 AM