‘పార్టీలకు అతీతంగా సంక్షేమం’
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:18 AM
గ్రామస్థాయిలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడుతు న్నామ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): గ్రామస్థాయిలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడుతు న్నామ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. బుధవారం రావివలస సచివాలయాన్ని ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అర్హతగల వారికి పింఛన్లు అందించేం దుకు అవసరమైన వివరాలను సకాలంలో పొందుపరచాలన్నారు. దరఖాస్తుల నమోదులో సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అనంతరం సచివాలయ కార్యదర్శి ఆర్.శశిభూషణరావుకు పలు సూచనలు చేశారు. ఆమెతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్లు ఎ.తవిటి నాయుడు, ఎ.మధుసూదనరావు, టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.నారాయణస్వామి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఎం.తవిటినాయుడు, ఎంపీటీసీ సభ్యులు కె.భరత్‌కుమార్, జి.కిశోర్, సీహెచ్.దామోదర్ నాయుడు, జి.సీతంనాయుడు పాల్గొన్నారు.