సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:02 AM
సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
చీపురుపల్లి ఎమ్మెల్యే కళా
మెరకముడిదాం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. నరసయ్యపేటలో ఏర్పాటుచేసిన పంచాయతీ భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈసం దర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పంచా యతీ భవనాలకు రూ.2కోట్లు 50లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. నాలుగు మండలాల్లో 18 భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకుడు తాడ్డి సన్యాసినాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ కోట్ల మోతీలాల్‌నాయుడు, ఎంపీడీవో శ్రీరాములునాయుడు, తహసీల్దార్ సులోచనరాణి, జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు కృష్ణవేణినాయుడు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్.రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.