హెల్మెట్ ధరించడం తప్పనిసరి
ABN , Publish Date - May 04 , 2026 | 12:15 AM
ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని సాలూరు సీఐ అప్పలనాయుడు సూచించారు.
సాలూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని సాలూరు సీఐ అప్పలనాయుడు సూచించారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో హెల్మెట్ ప్రాధాన్యతను ఆయన వివరించారు. హె ల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1035 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన వారిని ప్రోత్సహిస్తూ సీఐ కూల్ డ్రింక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పట్టణ పరిధిలో 65 ఓపెన్ డ్రింకింగ్, 13 ఓవర్ లోడ్, 250 టౌ న్ న్యూసెన్స్ కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పని సరిగా పాటించా లన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అనిల్‌కుమార్ ఉన్నారు.