పట్టణాభివృద్ధికి అహర్నశలు శ్రమిస్తా
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:13 AM
పట్టణాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యో తి): పట్టణాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం సాయంత్రం పట్టణం లోని ఆరో వార్డులోని మణికంఠ కాలనీ, కొత్తపోలమ్మ రాజీవ్ కాలనీలో రహదారులు, కాలువల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమా లను విజయవంతంగా అమలు చేస్తోంద న్నారు. అంతే కాకుండా 30 వార్డుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇంజనీరింగ్ అధికారులను ఆ సందర్భంగా ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అఽధ్యక్షులు కోలా మధు ఉన్నారు.
1