సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:02 AM
సోపేరు గ్రామం లోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ
రాజాం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సోపేరు గ్రామం లోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు. శనివారం సోపే రు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆయన అధికారులతో కలిసి, పర్యటించారు. మరుగుదొడ్లు లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలువలు, సీసీ రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించలేదని.. ఎంత నిధులు అవసరం అవుతాయో ప్రతిపాదనలు తయారు చేసి, నివేదిక అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధు లు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అనంత రం కాలనీలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే రాజాం పట్టణంలో పాలకొండ రోడ్డు కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహా నికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంత రం మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీక రణ కార్యక్రమం చేపట్టారు. బూరాడలో శ్మశాన వాటిక కు అవసరమైన స్థలం లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని రిటైర్డ్ తహసీల్దార్ రామప్పడు, తీగల మోహన్‌రావులు ఫిర్యాదు చేశారు. ఎస్సీలపై దా డులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని పాండ్రంకి శ్రీనివాసరావు ఆయనకు వివరించారు. మారేడుబాకలో దళితుల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారని వైకుంఠరావు, తదితరులు విన తిపత్రం అందజేశారు. అన్ని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చా రు. తహసీల్దార్ రాజశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీని వాసరావు, చీపురుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.సిం హాచలం, మీసేవా సంస్థ కన్వీనర్ గండి చిరంజీవులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జొన్నాడ రంజిత్ పాల్గొన్నారు.
చీపురుపల్లిలో వినతుల స్వీకరణ
చీపురుపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శనివారం చీపు రుపల్లిలో దళితులతో సమావేశమయ్యారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన పలు దళిత సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం, దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఐ.సురేష్, తహసీల్దార్ డి.ధర్మరాజు పాల్గొన్నారు.