నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:42 AM
తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు హామీ ఇచ్చారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటన
చీపురుపల్లి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు హామీ ఇచ్చారు. పత్తికాయవలస, పీకే పాలవలస గ్రామాల్లో నేలకొరిగిన అరటి, బొప్పా యి పంటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం కర్లాం జడ్పీ ఉన్నత పాఠశాలలో దెబ్బతి న్న ప్రహరీని పరిశీలించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ రేగాన రామారావు, వైస్ చైర్మన్ వలిరెడ్డి శ్రీరా ములునాయుడు, పార్టీ నాయకులు ఉన్నారు.
లక్కవరపుకోట, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రంగా రాయపురం గ్రామానికి చెందిన చెలికాని చిన్న అప్పా రావు పెంకుటిల్లు తుఫాన్ ధాటికి కూలిపోయింది. దీం తో ఎమ్మెల్యే లలితకుమారి శుక్రవారం ఆ కుటుం బాన్ని పరామర్శించి, ప్రభుత్వపరంగా రూ.5వేల నిత్యవసర సరుకులు అందించారు. పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు, తహసీల్దార్ పి.హరి, భూపాల్‌నాయుడు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం టౌన్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యో తి): పట్టణంలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం పరిశీలించారు. నగరం లోని 42వ డివిజన్ ఖాలీఘట్ కాలనీ, క్రాంతి కాలనీ లో నీట మునిగిన పలు ప్రాంతాలను ఆమె పరిశీలిం చి, కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ముం పు సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
సంతకవిటి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మండలం లోని ముంపు గ్రామాల్లో టీడీపీ నాయకులు శుక్రవా రం పర్యటించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శి కొల్ల అప్పలనాయుడు, రాజాం వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లూరు గణేష్, టీడీపీ మండల అధ్యక్షు డు గట్టి భానుతో పాటు పలువురు నాయకులు ముం పు ప్రాంతాలను పరిశీలించారు.