జిందాల్ నిర్వాసితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:02 AM
జిందాల్ నిర్వాసితులకు అండగా ఉంటామని జనసేన పార్టీ పార్వతీపురం ఇన్‌చార్జి ఆదాడ మోహన్‌రావు అన్నారు.
ఎస్.కోట రూరల్, జనవరి 26(ఆంధ్రజ్యో తి): జిందాల్ నిర్వాసితులకు అండగా ఉంటామని జనసేన పార్టీ పార్వతీపురం ఇన్‌చార్జి ఆదాడ మోహన్‌రావు అన్నారు. సోమవారం బొడ్డవర గ్రామంలో జిందాల్ నిర్వాసితులను ఆయన ఏపీ రైతుసంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో కలిసి, సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది కార్పొరేట్లు, అధికారులు, నాయకులు జిందాల్‌కు సహకరించడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంపై తమ నేత పవన్‌కల్యాణ్‌ను కలిసి వారికి జరిగిన మోసాలను వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఒంటి అప్పారావు, పలు పంచాయతీల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.