బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:33 PM
పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందినవారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు.
బెలగాం, ఫిబ్రవరి3 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందినవారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ జి.పోలిరాజు భార్యకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ నియామక పత్రాన్ని మంగళవారం ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబంలో అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తోం దన్నారు. అందులో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ భార్య స్వాతికి పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌గా ఉద్యోగం అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి పాల్గొన్నారు.