బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:47 AM
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.
గెడ్డలో పడి చిన్నారులు తిచెందడంపై దిగ్ర్భాంతి
టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు
గరివిడి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): బాధిత కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. మండలంలోని విపిరేగ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు గెడ్డలో పడిమృతిచెందిన ఘటనపై రామ్‌మల్లిక్‌నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఈమేరకు బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఎర్రవెల్లి వర్ష (4), ఎర్రవెల్లి ధనుష్ (7) గెడ్డలో పడి ప్రాణాలు కోల్పో వడం హృదయవిదారకమని పేర్కొన్నారు.ఇటువంటి విషాదఘటనలు పునరావృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని గెడ్డలు, కాలువలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన వెంట టీడీపీ మండలాధ్యక్షుడు సారిపాక సురేష్‌కుమార్ ఉన్నారు.