నిర్లక్ష్య వైఖరి వీడకపోతే ధర్నాలు చేస్తాం
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:11 AM
విద్యుత్ శాఖాధికా రులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, లేకపోతే ధర్నాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ హెచ్చరించారు.
విద్యుత్ అధికారుల తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ ఆగ్రహం
రోడ్డుపై బైఠాయింపు
గుర్ల, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖాధికా రులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, లేకపోతే ధర్నాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ హెచ్చరించారు. విద్యుత్ శాఖాధికారుల తీరుకు వ్యతిరే కంగా ఆయన గురువారం స్థానిక విద్యుత్ శాఖ కార్యా లయం ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ముం దుగా చలానా కట్టిన రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వకుం డా, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఇవ్వడంపై ఆయన ఆందోళనకు దిగారు. పది సార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయట్లేదన్నారు. సంబంధిత అధికారులు దిగివచ్చి సమాధానం చెప్పకపోతే జిల్లా స్థాయిలో భారీగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఐ నారాయణ రావు తన సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకుని, వారికి నచ్చజెప్పి, విద్యుత్ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
వైసీపీకి కొమ్ము కాస్తున్నారు..
గుర్ల మండలంలో కొంతమంది అధికారులు పూర్తిగా వైసీపీకి కొమ్ము కాస్తూ కూటమి ప్ర భుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా రని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ఆరోపించారు. గురువారం ఆయ న గుర్లలో విలేకర్లతో మాట్లాడారు. పల్లిగండ్రేడు గ్రామంలో రైతులు విద్యు త్ కనెక్షన్ కోసం చలానా కట్టి రోజులు గడుస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోలేదని అన్నా రు. మరి కొంతమంది వైసీపీ నాయకుడు చెప్పిన వారి కి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని ఆయన విమర్శించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలన్నారు.