Share News

దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:17 AM

స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు.

 దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం

విజయనగరం రూరల్‌, మార్చి 20(ఆంధ్ర జ్యోతి): స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో వచ్చే సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు.

నిరుపేద కుటుంబానికి ‘మిషన్‌ వాత్సల్య’

విజయనగరంలోని మూడవ డివిజన్‌ పరిధిలోగల పూల్‌బాగ్‌ కాలనీ బిట్‌ నెంబరు 4లో నివాసం ఉంటు న్న కెల్ల మహాలక్ష్మి కుమారుడు, కోడలు ఇటీవల మృతి చెందారు. ఈనేపథ్యంలో వారి పిల్లలు మేఘమాల, రోహిత్‌.. మహాలక్ష్మి వద్దే ఉంటున్నారు. అయితే వృ ద్ధురాలైన తనకు వీరిద్దరినీ పోషించడం కష్టంగా మారిందని ఆమె.. ఎమ్మెల్యే అదితికి ప్రజాదర్బార్‌లో వినతిపత్రం అందజేశారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. అక్కడి నుంచే కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డితో, అదేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో ఇద్దరు పిల్లల్లో ఒకరైన మేఘమాలకు బాబామెట్టలోని కేజీబీవీలో 9వ తరగతి, రోహిత్‌ను నెల్లిమర్ల లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం కల్పించారు. అదే విధంగా పిల్లలకు మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా మూడేళ్లకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు మహాలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 12:17 AM