ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం: మంత్రి శ్రీనివాస్
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:20 AM
ప్రజాదర్బా ర్‌లో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయనగరం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బా ర్‌లో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహిం చారు. మొత్తం 22 వినతులు వచ్చాయి. వినతులన్నిం టినీ పరిశీలించి, ప్రతి వినతి నీ పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. కొన్ని వినతులపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ శాఖకు సంబంధించి 8, రెవెన్యూ విభాగానికి సంబంధించి 7 వినతులు మంత్రి దృష్టికి వచ్చాయి. ఈ కార్యక్రమంలో గజపతినగరం ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, మక్కువ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.