Share News

ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:35 AM

గ్రామ స్థాయిలోని ప్రతి సమస్యను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం
ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌లో పాల్గొని ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి

కొమరాడ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయిలోని ప్రతి సమస్యను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనల కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కోరమండల్‌ ఫెర్టిలైజర్‌ అవుట్‌ లెట్‌ను సందర్శించారు. ఏపీఎంఎస్‌ యాప్‌ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. మసిమండ, పెదశాఖ కుంతేసు గ్రామాల రైతులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఆర్డీవో కె.మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి ఆర్‌.అన్నపూర్ణ, రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించి సూచనలు చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 12:35 AM