ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం
ABN , Publish Date - May 23 , 2026 | 12:23 AM
ప్రజా ఫిర్యాదుల్లో ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన హామీ ఇచ్చారు.
బొబ్బిలి రూరల్, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల్లో ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్‌ఎస్ ను నిర్వహింయారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని 152 అర్జీలను స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్ర బాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీను, ఎంపీడీవో రవికుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గజపతినగరం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన విదార్థినులు టెన్త్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో వారిని ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఎంఈవో రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.