అర్హులందరికీ ఇళ్ల మంజూరు చేస్తాం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:12 AM
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో సొంతిం టి కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తా మని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భరోసా ఇచ్చారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి
నెల్లిమర్ల, అక్టోబరు 9(ఆం ధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో సొంతిం టి కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తా మని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భరోసా ఇచ్చారు. శుక్రవారం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో సుమారు 1400 మంది హౌసింగ్ లబ్ధిదారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణం చేపడతామన్నారు. జనసేన పార్టీ నాయకులు చనమల వెంకటరమణ, రవ్వా నాని, అప్పికొండ రవి, గంటా సతీష్, ఎంఎం.నాయుడు, అవనాపు మురళి తదితరులు పాల్గొన్నారు.