Share News

సంకిలి పరిశ్రమను కాపాడుకుంటాం

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:16 AM

సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమను కాపాడుకు నేందుకు రైతులు, పరిశ్రమ పరిరక్షణ కమిటీ సభ్యులు నడుం బిగించారు.

సంకిలి పరిశ్రమను కాపాడుకుంటాం

  • దశలవారీ ఉద్యమానికి పరిరక్షణ కమిటీ కార్యాచరణ

  • ప్రజాప్రతినిధులతో ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం

రేగిడి, సెప్టెంబరు 10(ఆంధ్ర జ్యోతి): సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమను కాపాడుకు నేందుకు రైతులు, పరిశ్రమ పరిరక్షణ కమిటీ సభ్యులు నడుం బిగించారు. ఈ మేరకు గురువారం సంకిలిలో అత్యవసర సమావేశమ య్యారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తదిత రుల ఆధ్వర్యంలో రేగిడి, పాలకొండ మండలాల రైతులు తమ అభిప్రాయలు తెలిపారు. సుగర్స్‌ క్రషింగ్‌ వచ్చే ఏడాది నిలుపుదల చేస్తున్న ప్రకటనపై తీవ్రంగా స్పందిం చారు. తక్షణమే యాజమాన్యం ఈ ప్రకటన విరమించు కునేలా ఉద్యమించాలని, ఇందుకు దశలవారీగా పోరాటా లకు సిద్ధపడాలని నిర్ణయించారు. ముందుగా ఫ్యాక్టరీ గేట్‌ వద్ద రిలే దీక్షలు చేసేందుకు నిర్ణయించారు. వినాయక చవితి అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలకతీతంగా ఇతర ప్రజాప్రతినిధుల బృందంతో చెన్నై, ఢిల్లీ వెళ్లి ఈఐడీ ప్యారీ సంస్థ చైర్మన్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసేలా నిర్ణయం తీసుకున్నట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు.

కేన్‌ కమిషనర్‌, ఫ్యాక్టరీ జీఎమ్‌లకు వినతి

సమావేశం అనంతరం పాలకొండ సందర్శనకు వచ్చిన బొబ్బిలి కేన్‌ కమిషనర్‌ సత్యనారాయణను, స్థానిక ప్యారీ సుగర్స్‌ జీఎమ్‌ వెంకట్‌ సూర్యను ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు వేర్వురుగా వారి కార్యాలయాల్లో గురువారం కలిశారు. వచ్చే ఎడాది క్రషింగ్‌ సీజన్‌ నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటన విరమించుకోవాలని, చెరకు రైతుకు గతంలో ఇచ్చే సాగు రాయితీలు ఇవ్వాలని, తొలగించిన కేన్‌ సిబ్బందిని నియమించి ఫ్యాక్టరీని కాపాడాలని వినతిపత్రం అందించారు. కమిషనర్‌, జీఎంలను కలిసిన వారిలో ఏపీ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడుతో పాటు, రేగిడి, పాలకొండ మండలాల చెరకు రైతులు ఉన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:16 AM