Share News

‘60 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం’

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:41 AM

విద్యుత్‌ సమస్య లను 60 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టామని సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు ఎస్‌.సుబ్బారావు, ఎం.విజయ చాముండి తెలిపారు.

‘60 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం’
ఫిర్యాదు అందజేస్తున్న వినియోగదారుడు

పాచిపెంట రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సమస్య లను 60 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టామని సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు ఎస్‌.సుబ్బారావు, ఎం.విజయ చాముండి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం లో బుధవారం నిర్వహించిన విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదికలో వారు 21 ఫిర్యాదులు స్వీకరించారు. వ్యవసాయ మోటార్లకు అధిక బిల్లులు, విద్యుత్‌ స్తంభాల మార్పు, పాతలైన్ల స్థానంలో కొత్త లైన్లు, తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, విద్యుత్‌ అంతరాయాలపై పలువురు ఫిర్యాదు చేశారు. సమస్యలను పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని సభ్యులు హామీఇచ్చారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సూపరింటెండెంట్‌ కె.త్రినాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:41 AM