నిందితులను కఠినంగా శిక్షిస్తాం
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:22 AM
చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహ న్‌రెడ్డిని హత్యచేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షి స్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి శ్రీనివాస్
విజయనగరం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహ న్‌రెడ్డిని హత్యచేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షి స్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి చర్యలను టీడీపీ ఉపే క్షించదన్నారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్షను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూ తి తెలిపారు.
ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేష్ నాయుడు, ఆర్.వ్యాస్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీ శంకర్‌రావులు డిమాండ్ చేశారు.
హత్యను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
విజయనగరం, కలెక్టరేట్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్‌ను హత్య చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించిం ది. యూనియన్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ మిని స్టీరియల్ భవనంలో మంగళవారం సమావేశం నిర్వ హించారు. జగన్ హత్యకు నిరసనగా యూనియన్ నా యకులు కాసేపు మౌనం వహించారు. జిల్లా స్థాయిలో ఎటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ శివ ప్రసాద్, యూనియన్ నాయకులు ఎలిశెట్టి సురేష్, లింగాల నర్సింగరావు, పం చాది ఆప్పారావు, ఆరిపాక రాము, ఎంఎస్‌ఎన్ రాజు, యుగంధర్, రాధాకృష్ణ, సన్యాసిరావులు పాల్గొన్నారు.
వెంటనే అరెస్టు చేయాలి
గుర్ల, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి విలేకరి ని అతిక్రూరంగా చంపడంపై గుర్ల ప్రెస్ యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడారు. దోషులు ఎంతటివారైనా సరే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని కోరారు.