Share News

ప్రతి రైతుకు యూరియా అందజేస్తాం

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:11 AM

ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని వ్యవ సాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.రామారావు తెలిపారు. బుధవారం మండలంలోని మురపాకర, పెదవేమలిల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి రైతుకు యూరియా అందజేస్తాం
గంట్యాడ: మాట్లాడుతున్న రామారావు

గంట్యాడ, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని వ్యవ సాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.రామారావు తెలిపారు. బుధవారం మండలంలోని మురపాకర, పెదవేమలిల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా పంపిణీ గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఓటీపీతో ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నా మని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉం దని, దీంతో రైతులు పంటలు బీమాకు వరి పంట కోసం వచ్చే నెల 15లోగా ఎకరాకు రూ 200 చెల్లించాలని కోరారు. కార్యక్రమంలోని ఏవో శ్యామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఎల్‌నిన్‌ వల్ల వర్షాభావం: ఏడీ

కొత్తవలస, జూలై 22 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సమస్య ఈ ఏడాది ఉండ డంతో నీటి వినియోగం తక్కువుగా ఉన్న పంటలను మాత్రమే వేసుకోవాలని కొత్తవలస వ్యవసాయశాఖ ఏడీ బానూలత కోరారు. బుధవారం మండలంలోని చింతలపాలెంలో పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమాయోజనా పఽథకంలో బాగంగా ఖరీఫ్‌2026, రబీ 2026-27కు నమోదు ప్రక్రియ మొదలైందని తెలిపారు.

శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన

మెరకముడిదాం, జూలై 22(ఆంధ్రజ్యోతి): రైతులకు వరి సాగులో తీసుకోవాల్సిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై ఏవో ఎస్‌కే అహ్మద్‌గౌస్‌ అవగాహన కల్పించారు. గరుగుబిల్లి రైతు సేవా కేంద్రం పరిధిలో పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు టి.అనూష పాల్గొన్నారు.

ఫగరివిడి, జూలై 22(ఆంధ్రజ్యోతి): కుమారం, పాలవలసల్లో పొలంపిలుస్తోంది కార్యక్రమంలో ఏవో పి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పంటల ఇన్సురెన్స్‌పై అవకాహన కల్పించారు.కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:11 AM