అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:04 AM
అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
లక్కవరపుకోట, జూన్ 26(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. లక్కవరపుకోటలోని తన నివాసంలో శుక్రవారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 122 మంది వినతులు అందజేయగా, అందులో 110 ఫించన్ల కోసం దరఖాస్తు చేసినవే ఉండడం గమనార్హం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే కూటమి ప్రభుత్వం పింఛన్లను అందజేసి ప్రజల విశ్వాసాన్ని పొందుతుందని తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎస్.కోట నియోజకవర్గంలో ముఖ్య మంత్రి సహాయ నిధి మంజూరైన 47మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే లలితకుమారి చెక్కులు పంపిణీ చేశారు. రూ.26లక్షల 48 వేలు విలువగల చెక్కులను పంపిణీ చేసినట్టు చెప్పారు. చొక్కాకుల మల్లునాయుడు, చిన్నబ్బినాయు డు, దుర్గా ఉమేష్, రత్నాజీ, కన్నబాబు పాల్గొన్నారు.