Government Lands ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించం
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:39 PM
We Will Not Tolerate Encroachment of Government Lands ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని , కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. బుధవారం చింతలబెలగాం గ్రామాన్ని సందర్శించారు.
జియ్యమ్మవలస, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి): ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని , కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. బుధవారం చింతలబెలగాం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థుల మధ్యే శ్మశాన వాటిక స్థల వివాదంపై చర్చించారు. కబ్జాకు గరైన శ్మశాన వాటికలో 30 సెంట్లను దళితులకు ఇవ్వాలని తహసీల్దార్ ఎన్.అప్పారావును ఆదేశించారు. దీనికి ఎవరైనా అడ్డుపడితే చెరువును ఆక్రమించి సాగు చేస్తున్న వారి డీపట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిని విస్తరించాలని తురకనాయుడువలస గ్రామానికి చెందిన దళితులు, ఎర్రగొల్లలు సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.