పోరాటాన్ని ఉధృతం చేస్తాం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:29 AM
విద్యాహ క్కు చట్టం సెక్షన్ 23(1)ను సవరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహా యింపు ఇవ్వాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తా మని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మోహనరావు హెచ్చరించారు.
టెట్ వద్దంటూ ఉపాధ్యాయుల నిరసన
రాజాం రూరల్, ఆగస్టు 25(ఆంరఽధజ్యోతి): విద్యాహ క్కు చట్టం సెక్షన్ 23(1)ను సవరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహా యింపు ఇవ్వాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తా మని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మోహనరావు హెచ్చరించారు. టెట్‌కు వ్యతిరేకంగా రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్పెషల్ టెట్ పాస్ మార్కులు 40గా ఉండాలని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించా లని, పరీక్షను బోధించే సబ్జెక్ట్‌కే పరిమితం చేయాల ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పక్కి వాసుదేవరావు, నాలుగు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చీపురుపల్లి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.