Share News

దళితుల నిరసన ఉధృతం చేస్తాం

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:00 AM

అన్యాయానికి గురైన దళితులు న్యాయం కోసం 52 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని.. ఇకపై నిరసన ఉధృతం చేస్తామని కరీంనగర్‌కు చెందిన సమతా సైనిక్‌ దళ్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ రేంజర్ల రాజేష్‌ అన్నారు.

 దళితుల నిరసన ఉధృతం చేస్తాం

భోగాపురం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అన్యాయానికి గురైన దళితులు న్యాయం కోసం 52 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని.. ఇకపై నిరసన ఉధృతం చేస్తామని కరీంనగర్‌కు చెందిన సమతా సైనిక్‌ దళ్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ రేంజర్ల రాజేష్‌ అన్నారు. ముంజేరు సిద్ధార్థా కాలనీకి చెందిన దళితులు భోగాపురం మండల కార్యాలయాల కూడలిలో చేపడుతున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. పలు గేయాలు ఆలపించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇది దళితులకు బ్లాక్‌ డే అన్నారు. మురుగు కాలువ సమస్యపై న్యాయబద్ధంగా 52 రోజులుగా పోరాడుతున్నా కనీసం స్పందించకపోవడం దారుణంగా ఉందన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:00 AM