సంక్షోభంలోనూ పథకాలు అమలు చేస్తాం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:28 AM
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని జిల్లా ఇన్‌చా ర్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
విజయనగరం ఆంధ్రజ్యోతి/ కలెక్టరేట్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని జిల్లా ఇన్‌చా ర్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026-27 బడ్జెట్ అవుట్‌రీచ్-మండలాల వారిగా కేటాయింపుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాను పారి శ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉందన్నారు. ఖర్చు చేసిన నిధులకు వినియోగ పత్రాలను ఆందజేయాల న్నారు. పథకాల అమలుపై ఎమ్మెల్యేలతో చర్చించి ప్రా ధాన్యతలను నిర్ణయించాలని అధికారులకు సూచించా రు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడు తూ రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయని, పరిమిత వనరులతోనే స మర్థంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పెర్‌కాపిటల్ ఆదాయాన్ని పెంచాల్సి ఉందని, ఉద్యాన సాగు ద్వారా ఇది సాధ్యమ వుతుందని తెలిపారు. అనంతర కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి.. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఆర్థిక పరిస్థితులను వివరించారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లా 15 శాతం అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పని చేస్తున్నా మన్నారు. జిల్లాకు సంక్షేమ పథకాల కోసం రూ.2,265. 77 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కోసం రూ.1,417.77 కోట్లు, తల్లికి వందనం రూ.341.95 కోట్లు, అన్నదాతా సుఖీభవ కోసం 325.63 కోట్లు, దీపం-2 కింద రూ.118.62కోట్లు, స్రీశక్తి-మహిళలకు ఉచి త బస్సు పథకం రూ.30.37 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలో రూ.24.14 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.7.60కోట్లు కేటాయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్‌తో పాటు ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరా వు, అదితి గజపతిరాజు, కోళ్ల లలితకుమారి, బేబీనాయ న, ఎమ్మెల్సీలు సూర్య నారాయణరాజు, గాదె శ్రీనివాసు లునాయుడు, కావలి గ్రీష్మ, రఘురాజు పాల్గొన్నారు.
సబ్‌జైలు తనిఖీ
విజయనగరం క్రైం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌జైలు, రూరల్ పోలీస్‌స్టేషన్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం తనిఖీచేశారు. జైలులో రికార్డులను, వంట గదులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి.. వారికి అందుతున్న భోజన సదుపాయాలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూర ల్ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, మహిళా భద్రత కోసం పనిచేస్తున్న ‘శక్తి టీమ్స్’ పనితీ రుపై సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ కు, విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. హోంమంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ దామోదర్ ఉన్నారు.