మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:42 PM
మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచే విధంగా, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా శిక్షణ ఇస్తామని మంత్రి కొండ పల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
- ప్రతి జిల్లా నుంచి 300మందిని ఎంపిక చేస్తాం
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
దత్తిరాజేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచే విధంగా, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా శిక్షణ ఇస్తామని మంత్రి కొండ పల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దత్తిరాజేరులో కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీహెచ్‌సీలను రామభద్ర పురం, ఎల్.కోట, గంట్యాడలో కూడా ప్రారంభించినట్లు తెలి పారు. ప్రతి జిల్లాలో నైపుణ్యం కలిగిన 300మంది మహిళలను ఎంపిక చేసి గ్లోబల్ మార్కెటింగ్ చేయడం కోసం త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు. సీహెచ్‌సీల ద్వారా రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందజేస్తామన్నారు. అనంతరం సీహెచ్‌సీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు
- సరేయవలస గ్రామంలో యూనియన్ బ్యాంకు సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో గ్రామస్థులకు ఇచ్చిన హామీ మేరకు ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో 4 వాటర్ ప్లాంట్ల నిర్మాణానికి సహకారం అందించిన యూనియన్ బ్యాంకుకు ధన్యవాదాలు తెలిపారు.
- దత్తిరాజేరులో ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన 2.0 కింద పలువురు లబ్ధిదారులకు మంత్రి వ్యవసాయ పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్, రామ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, యూనియన్ బ్యాంకు బ్రాంచి మేనే జర్ సునీత్, డ్వాక్రా మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
‘బొత్స నిజాలు మాట్లాడాలి’
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిజాలు మాట్లాడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఇటీవల బాడంగి పర్యటనలో బొత్స.. పోలవరం ఎత్తుపై చేసి న వ్యాఖ్యల గురించి మంత్రిని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. పోలవరం డ్యామ్ ఎత్తుపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని హితవు పలికారు. ‘పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీరు చేరుకుంటుంది. అక్కడ నుంచి మూడు లిప్టుల ఎత్తిపోతల ద్వారా తాడిపూడికి, 6 లిప్టుల ద్వారా బాడంగికి నీరు వస్తుంది. ఈ విషయాన్ని బొత్స గ్రహించాలి. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన ఘనత గొడ్డలి పార్టీకే దక్కుతుంది.’ అని అన్నారు.
బుచ్చి అప్పారావు మార్గదర్శకులు..
గంట్యాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తాటిపూడి రైతులకు గొర్రెపాటి బుచ్చి అప్పారావు మార్గదర్శకులు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాటిపూడి రిజర్వాయర్ సాధకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ జిల్లా బోర్డు అధ్యక్షుడు గొర్రెపాటి బుచ్చిఅప్పారావు జయంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందుతుందంటే అప్పారావు వల్లనేనని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, టీడీపీ నాయకులు ఉన్నారు. పెంటశ్రీరాంపురంలో రూ10 లక్షలతో నిర్మించనున్న మత్య్సకారుల సామాజిక భవనానికి, రూ.28.40 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గోపాలరాజు, కొప్పలవెలమ కార్పొరేషన్ డైరక్టర్ అల్లు విజయకుమార్, టీడీపీ మండల అధ్యక్షులు కొండపల్లి భాస్క ర్‌నాయుడు, నాయకులు బి.అప్పలనాయుడు పాల్గొన్నారు.