నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతాం
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:05 AM
దీపావళి సందర్భంగా మం దుగుండు సామగ్రి అమ్మకాలు సాగి స్తున్న షాపుల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పీవీఎస్ రాజేష్ హెచ్చరిం చారు.
విజయనగరం, నవంబరు 7(ఆం ధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా మం దుగుండు సామగ్రి అమ్మకాలు సాగి స్తున్న షాపుల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పీవీఎస్ రాజేష్ హెచ్చరిం చారు. జిల్లాలోని అగ్నిమాపక సామగ్రి విక్రయ కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలకు టపాసులు కాల్చేట ప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగా హన కల్పించారు. సహాయ అగ్నిమాప క శాఖాధికారి వి.సోమేశ్వరరావు, సిబ్బంది తో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. టపాసులు విక్రయించే షాపుల యాజ మానులకు అమ్మకాలు పట్ల అప్రమత్తం గా వ్యవహరించాలని సూచించారు.