Share News

సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాడుతాం

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:00 AM

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో కార్మి కుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాటాలు కొనసాగిస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రంగరాజు, జె.కామేష్‌లు తెలిపారు.

సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాడుతాం

  • మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు

  • సమ్మె తాత్కాలిక వాయిదా

విజయనగరం దాసన్నపేట, జూలై 19(ఆంధ్రజ్యో తి): విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో కార్మి కుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాటాలు కొనసాగిస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రంగరాజు, జె.కామేష్‌లు తెలిపారు. స్థానిక అమర్‌భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికులు సోమవారం నుం చి చేపట్టనున్న సమ్మెను అఽధికారులు అందుబాటులో లేనందున తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా న గరపాలక సంస్థలో పనిచేస్తు న్న కార్మికులకు 365 రోజులు పనిచేయించడం సరికాద న్నారు. వీరికి కనీసం వారాంతంపు పండుగ జాతీయ సెలవులు వర్తింప చేయాలని కోరారు. గత నాలుగేళ్లు గా అవుట్‌సోర్సింగు కార్మికులు సుమారు 80 మంది పదవి విరమణ పొందారని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలన్నారు. సీనియార్టీ ప్రకారం కార్మికులకు పదోన్నతుల అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సమావేశం లో సంఘ ప్రతినిధులు శ్రీను, చిరంజీవి, ఆదిలక్ష్మీ, శ్రీను, వినోద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:00 AM