ఆయుష్ సేవలు విస్తృతం చేస్తాం
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:42 AM
జిల్లావ్యాప్తంగా ఆయుష్ వైద్య సేవలు మరింత విస్తృతం చేస్తామని ఆ శాఖ జిల్లా వైద్యాధికారి టి.హేమాక్షి అన్నారు.
జియ్యమ్మవలస, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఆయుష్ వైద్య సేవలు మరింత విస్తృతం చేస్తామని ఆ శాఖ జిల్లా వైద్యాధికారి టి.హేమాక్షి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయుర్వేద వైద్య సేవలు గ్రామాల్లో విస్తృతపర్చడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక, సీజనల్ రుగ్మతలు ఆయుర్వేద వైద్యంతో నయమవుతాయన్నారు. కార్య క్రమంలో ఆయుర్వేద వైద్య సిబ్బంది శ్రీనివాస్, పద్మలు పాల్గొన్నారు.