Share News

ముంజేరు బాధితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:05 AM

ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీ బాధితులకు త్వర లోనే న్యాయం జరుగుతుందని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు.

ముంజేరు బాధితులకు న్యాయం చేస్తాం

  • ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

భోగాపురం, జనవరి 5(ఆంధ్ర జ్యోతి): ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీ బాధితులకు త్వర లోనే న్యాయం జరుగుతుందని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. భోగాపురం మండల కార్యాల యాల కూడలిలో వారు నిర్వహి స్తున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది నవంబరు 20న ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారిని దర్యాప్తు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 34 మంది నిందితులకు అరెస్టు నోటీసులు జారీ చేశామన్నారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యిందని, త్వరలోనే సంబంధిత కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేస్తా మని చెప్పారు. అలాగే ముంజేరుకు చెందిన పలువురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ మురుగునీటి కాలువ సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ తగాదాకి సంబంధించి కేసును పరిష్కరిస్తామని, మురుగుకాలువ సమస్య అధికారులకు చెందిందని.. చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతక ముందు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐలు వి.పాపారావు, పి.సూర్యకుమారి పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:05 AM